ఆకాశరాజు వృత్తాంతము
తిరుపతికి ఇరువది మైలు సమీపమున నారాయణపురం కలదు.
ఆ పురమునును రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు.విష్ణుమూర్తి శాపము వలన రాక్షసుడు అయిన చోళరాజు కొంత కాలము సంచరించి ఆయువుముడిన తరువాత సుధర్ముని భార్య గర్భమున ప్రవేశించి సుధర్ముడు కుమారుడుగా జన్మించెను.
సుధర్ముడు ఆ బిడ్డకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నచుండెను.సుధర్ముడు ఒకనాడు వేటకై వెళ్లి వేటాడి అలసిపోయి కొంతసేపు విశ్రాంతి తీసుకొనుటకు సమీపమున ఉన్న కపిల తీర్థము నందు దాహం తీర్చుకుని అక్కడ కూర్చుండెను.
అప్పుడు నాగ కన్య కపిల తీర్థంలో స్నానం చేసి వచ్చుచుండగా ఆమె అందచందాలకు మోహ పరవశులై సుధర్ముడు ఆమెను సమీపించి వివరములు అడిగి తెలుసుకుని గాంధర్వ వివాహం చేసికొనెను. ఆ నాగకన్యక సుధర్ముడుకు జన్మించినవాడే తొండమానుడు.
సుధర్ముడు అవసాన దశలో తన పెద్ద కుమారుడైన ఆకాశరాజునకు రాజ్యమును పట్టము గట్టి తొండమానుని అప్పగించి సుధర్ముడు కన్నుమూసినేను.
ఆకాశరాజు ధర్మము తప్పక రాజ్యము పరిపాలించిచున్నాడు. ఆకాశరాజు ధర్మపత్ని ధరణీదేవి పేదలను ఆదరించు ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకొని చుండెను.
ప్రజలు వీరి పాలనలో ఆనందముగా జీవనము గడుపుచు రాజ భక్తి కలిగి యుండిరి. ఆకాశరాజు నాకు ఏ కొరతా లేదు కానీ సంతానము లేని కొరతయే వారిని వేదించుచుండెను.
ఒక శుభదినమున ఆకాశరాజు తన కులగురువైన సుఖ మహర్షిని ఆహ్వానించి పాదపూజలు చేసి మాకు సంతానము కలుగు మార్గమును తెలుపుమని ప్రార్ధించెను.
సుఖమహర్షి ఓ రాజా పూర్వకాలమున జనక మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి సంతానమును పొందెను. నీవు కూడా ఆ విధముగా యాగము చేసిన యెడల భగవానుడు తప్పక సంతానము అనుగ్రహించగలడు అని చెప్పెను.
అందులకు ఆకాశరాజు సంతోషించి సుమ ముహూర్తమున బ్రాహ్మణులను రప్పించి యాగమునకు కావలసిన సామాగ్రి అంతయును సమకూర్చెను.
యజ్ఞము చేసే స్థలంలో బంగారు నాగలితో రాజే స్వయంగా దున్నుచుండగా నాగలికి ఏదో తగిలి నాగలి ఆగిపోయాను. అచట మట్టి తీసి చూడగా ఒక పెట్టె కనిపడెను. రాజు ఆ పెట్టెను తెరచి చూడగా సహస్రదళ కమలముల మధ్యలో అందాల పసిపాప కనిపించింది.
వెంటనే ఆకాశంలో మెరుపు మెరిసింది . ఆకాశవాణి రాజా నీవు ధన్యుడవు . నీవు పూర్వజన్మ పుణ్యము వలన నీ వంశంలో జన్మించిన శిశువు వలన మీ వంశం తరించెను అని పలికెను. సుఖమహర్షి ,బ్రాహ్మణులు ,ఆకాశరాజు, ధరణీదేవి ఆకాశవాణి పలుకులు విని మహదానంద భరితులయ్యారు .
శిశువు నెత్తుకొని మహర్షి బ్రాహ్మణులచే ఆశీర్వాదము పొంది యాగము పూర్తిచేసి, యాగశాల నుండి రాజదంపతులు పరివారములు మందిరములునాకు పోయి ఈ శిశువునకు నామకరణము చేయవలసినని సుఖమహర్షి ని అడగగా పద్మములో జన్మించి ఈ శిశువునకు పద్మావతి అని పేరు పెట్టాదాడు..
అందులకు ఆకసారాజు దంపతులు ఆనందంతో పద్మావతి అని నామము పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్న సాగిరి.
ఆ శిశువు దొరికిన సుముహూర్తాన ఫలమువలన అచిరకాలంలోనే ధరణీదేవి గర్భము దాల్చి ఒక శుభదినమున మగ శిశువును ప్రసవించింది.
ఆ బిడ్డకు వసూదనుడు అని నామకరణము చేశారు. పద్మావతి వసూదనులను ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకున్న సాగిరి.
0 Comments