Sri Venkateswara Jeevitha Charitra Episode 2
రెండవ భాగము శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మహత్యం
బ్రహ్మదేవుడు సభలో ఉన్న వారందరికీ వేద ధర్మాలు వివరించు నాడు. ఆ సమయమున భ్రుగుమహర్షి సభ లోనికి ప్రవేశించెను .ఆ ప్రదేశం అంతా ఒక్క క్షణం పరికించి చుచి బ్రహ్మకు నమస్కరించ కుండా గర్వంతో గద్దెపై కూర్చున్నాడు. సభ వారందరూ భృగు రాకకు సంతోషించారు కానీ బ్రహ్మ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించటం అక్కడ వారిని ఆశ్చర్యానికి కలగజేసింది. అతని ప్రవర్తన గర్వంతో కూడినదని అందరూ అనుకున్నారు.
భృగు తిరస్కారము బ్రహ్మదేవునకు అవమానముగా తోచినది. సభా మర్యాదలు తెలిసికూడా పాటించ లేనందుకు బ్రహ్మదేవుడు భృగువు పై పట్టరాని కోపం వచ్చింది.బ్రహ్మదేవుడు భ్రుగుమహర్షి తో ధర్మాధర్మములు తెలిసి గొప్ప తపస్సు చేసి మహిమలు సంపాదించిన నీవు గౌరవమర్యాదలు కలవాడని అనుకున్నాను కానీ ఇంతటి మూర్ఖుడు అని అనుకోలేదు.
ఈ సభలో ఉన్న మహారుషులు కంటే నీవు అంతటి ఘనుడువా.త్రిమూర్తులను సహితము పసిపాపలుగా మార్చివేసిన అత్రి మహాముని భార్య అనసూయ దేవి కంటే గొప్ప వాడివా. దేవేంద్రుడునే శపించిన గౌతమ మహర్షి కంటే అదికూడవ. జమదగ్ని కంటే శక్తి సంపన్నుడువా. నీవు వట్టి తెలివి హీనుడు అని నేను ఎన్నడూ అనుకోలేదు.
అని బ్రహ్మ ఇష్టమొచ్చినట్లు భృగు మహర్షిని దూషించారు.
భృగువు గద్దె నుంచి లేచి హౌరా బ్రహ్మదేవునకు ఎంత దురభిమానము ఇట్టి గుణము గల వాడు యజ్ఞ ఫలములను స్వీకరించుట అనర్హుడు. బ్రహ్మ దేవా నేను వచ్చిన పని నీవు తెలుసుకొనలేక అనవసరంగా నన్ను దూషించి నందులకు ప్రతిఫలము అనుభవించు అని
నీకు భూలోకములో దేవాలయమును గాని పూజలు గాని ఉండవు అని శపించి అచట నుండి కైలాసమునకు బయలుదేరును.భృగు మహర్షి.
నీకు భూలోకములో దేవాలయమును గాని పూజలు గాని ఉండవు అని శపించి అచట నుండి కైలాసమునకు బయలుదేరును.భృగు మహర్షి.
2.బృగు మహర్షి కైలాసము వెళ్లి శివదేవుని పరీక్షించి శపించుట
వెండికొండలో కి భృగువు ప్రేవేశించెను. ఎక్కడ చూచినను శివనమస్మరణము. కైలాసపర్వతం పై ఎక్కడ విన్నాను పంచాక్షరీ మంత్రం ప్రణవనాధమే కానీ వేరే లేదు.భృగువు శివుని ఏకాంతమందిర మునకు ప్రవేశించుచుండ ద్వార పాలకులు అడ్డుతగిలి యిట్లు విన్నవించిరి:
పార్వతీదేవి, శివుడు ఏకాంత సమయము కావున యిప్పుడు దర్శనము లభించదు అని చెప్పిరి.కాని భృగుమహర్షి ద్వారపాలకుల మాటలను లక్ష్యపెట్టకుండ లోనికి ప్రవేశించెను.సరసాలు అడుచున్న , పాఠ్వతీపర మేశ్వరులు భృగుమహర్షివి చూచిరి.
పార్వతీదేవి పరమపురుషుడైన భృగువును చూచి సిగ్గుతో ప్రక్కకు తొలగెను.భృగువును చూచి శంకరుడు రౌద్రరూపమును దాల్చినవాడై "ఓయీ : భృగూ బ్రహ్మవంశములో పుట్టి మహాతపశ్శాలివై యుండి వేదములు చదివి ధర్మాధర్మమును తెలిసినవాడవయి యుండి నీకు మర్యాదలు తెలియకపోవడము సిగ్గుచేటు"అని తన త్రికూలము ఎత్తుకొనెను. పార్వతీదేవి అడ్డుపడగా శాంతించెను.
భృగువు నిలకంఠుని పై కోపించి పరమేశ్వరా ! శివా' శంకరా ! నేను వచ్చిన కారణము తెలియక నాపై శూలము ఎ త్తెదవా ? ఇదే నా శాపము అనుభవించు :
"నీకుభూలోకములో నీయొక్క దేవాలయము అందు నీ రూపమునకు బదులు శివలింగాన్నిమాత్రమే పూజింతురుగాక ।" అని శపించి తక్షణం కైలాసమును వీడి వైకుంఠమునకు బయలుదేరి వెళ్లెను.
3. భృగు మహర్షి శ్రీహరిని పరీక్షించి, వక్షస్థలమున తన్నుట
వైకుంఠము అతిసుందర మైన పట్టణము. వైకుంఠము లక్ష్మీదేవి వివానము గనుక బోగభాగ్యములకు పుట్టిని ల్లె కన్నులకు పండుగగా కళకళ లాడుచుండెను. భృగువు వైకుంఠములో ప్రవేశించుచు ఇలా ఆలోచించెను . బ్రహ్మ మహేశ్వరులు రజోగుణము తమోగుణము కలవారు ఇక నా పరీక్షకు మిగిలి ఉన్నది వైకుంఠవాసుడు ఒక్కరే కదా అని తలంచుచు విష్ణువును సమీపించెను.
శ్రీమహావిష్ణువు శేషతల్పంపై పవళించి ఉండగా లక్ష్మీ దేవి భర్త పాదముల చెంత కూర్చుని తన మృధు హస్తములతో పాదములును వత్తు చుండెను. భృగు మహర్షి రాకను తెలిసి తెలియ నట్లు ఆదిదంపతులు నటించు చుండగా సత్య లోకము లోనూ కైలాసము లోనూ తనకు జరిగిన పరాభవము లను జ్ఞప్తికి తెచ్చుకుని ఇచ్చట కూడా తనకు పరభవము జరుగుచున్నది అని భావించి.
కోపముతో విచక్షణ జ్ఞాన రహితుడై పరుగుపరుగున వెళ్లి విష్ణు వక్షము పై తన కుడి కాలితో తన్నేను. లక్ష్మీదేవి నివ్వెరపోయి చూస్తున్నది . భృగుమహర్షి వచ్చిన ' కార్యమును గమనించిన విష్ణుమూర్తి యిసుమంతయు కోపించుకొనక , మీ రాకవలన వైకుంఠము పావనమైనది . అని భృగువును శేష తల్పముపై కూర్చుండబెట్టి , " మునీశ్వరా ! నేను ధరించియున్న ఆభరణములు తగిలి తమ పాదము ఎంత కందిపోయినదో అని భృగువు పాదమును ఒత్తుచు అతని అరికాలినందున్న మూడవ నేత్రమును చిదిపి వేసిను' ' మహర్షి మీరు గొప్ప తపస్సంపన్నులు , మహానుభావులు .
మీరు వచ్చిన కార్యమును వివరించండి " అని . శాంతముగా ఆడిగెను . ఎప్పుడైతే అరికాలియందున్న జ్ఞాననేత్రము పోయినదో అద్బా , అమ్మా , అంటు లేచి నిలబడి తాను చేసిన తప్పిదమును తెలుసుకొనెను . స్వామి వారిని క్షమించమని బహువిధముల ప్రార్థించెను .
శ్రీహరి శాంతముతో భృగూ ! నీవు నిమిత్తమాత్రుడవు . ఇందులో నీ దోషము ఏమియు లేదు . నీకు శుభమగుగాక ! అని దీవించెను . అప్పుడు భృగు మహర్షి మహానుభావా ! మా యజ్ఞఫలమును స్వీకరించుటకు తమరే సమర్థులు అని ప్రార్థించెను .
అందుకు విష్ణుమూర్తి మీ యజ్ఞము సంపూర్ణమగు సమయమునకు నేను వచ్చి యజ్ఞ ఫలమును స్వీకరింతును అని చెప్పెను . అందులకు భృగువు సంతోషించి శ్రీమన్నారాయణునివద్ద సేలవు తీసుకొని గంగానది తీరమువద్ద యజ్ఞము చేయుచున్న కశ్యపుడు , మొదలగు మునీశ్వరులవద్దకు వచ్చి త్రిమూర్తు లను తాను పరీక్షించిన విధానము పూసగూర్చినట్లు వివరించెను . శ్రీహరి ఒక్కరే శాంతమూర్తి , ఆయనే యాగఫలము స్వీకరించుటకు అర్హుడైన భగవానుడని ఈ యజ్ఞ ఫలమును అతనికే సమర్పించవలసినది అని చెప్పెను , ఋషులందరు అందు లకు సంతోషముగా అంగీకరించిరి .
0 Comments