ఆవు , దూడలను లక్ష్మిదేవి చోళరాజునకు విక్రయించుట ,
బ్రహ్మదేవుడు ఆవు రూపము శంకరుడు లేగదూడ రూపము ధరించినారు . లక్ష్మదేవి గొల్ల భామ వేషము ధరించి ఆవునూ లేగనూ తోలుకొని చోళ రాజు పాలించు చంద్రగిరి పట్టణము చేరెను .
గొల్లభామ , ఆవు దూడలను రాజు మందిరమునకు తోలుకొనిపోయి ఆ రాజును సమీపించి " ఆవు దూడలను అమ్మ దలచినాను . చాలా ఉత్తమజాతికి చెందినవి . దీనిని సామాన్య మానవులు పెంచ లేరు . కావున మీకు విక్రయించదలచినాను . " అని చెప్పెను .
చోళరాజు , అతని భార్య ఆవు , దూడల అంద చందములు మెచ్చుకొని గొల్ల భామ వద్ద ఆవు , దూడల కొన్నారు . లక్ష్మి రాజువద్ద సేలవు పుచ్చుకొని మరల కొల్హాపురములో తపస్సు చేసికొనుటకు వెళ్ళను.
చోళరాజు భార్య ఆ గోవు పాలతో తన బిడ్డలను పెంచాలని కోరిక కలిగెను . చోళరాజు నాకు అనేక ఆవులమంద లు కలవు పశువులను కాచే గొల్లవాని పిలిచి ఓరి ఈ నూతన ఆవు దూడలను చాలా శ్రద్ధగా పోషించి పాలు పితికి మాకు ఇవ్వవలసిందని ఆజ్ఞాపించెను.
గొల్లవాడు ఆవు దూడల తన పశువుల మందలలో కలిపి వేంకటాచలమున కు మేతకు తోలుకొని పోవుచుండెను .ఆ దేవతా పశువు మందుతో పాటు మేత మేయక ఒంటరిగా పోయి శ్రీహరి నివాసం ఉన్న పుట్టలో ఎవరికి తెలియకుండా తన పొదుగులో నున్న క్షీరమును ఆ పుట్టలో కురిపించి మరలా వచ్చి మందలో చేరు చుండెను.
ఆవు ఇంటిలో ఒక్క చుక్క పాలు కూడా ఇచ్చుట లేదు . కొంతకాలము గడిచిన తరువాత ఒకనాడు చోళరాజు ధర్మపత్ని గోపాలుని అని పిలిచి ఈ ఆవు పాలు ఇంతవరకు ఒక్కనాడైనా నువ్వు తెచ్చి ఇవ్వలేదు. ఈ ఆవు పాలు ఇస్తుందా లేక నీవు తాగుతున్నావా లేకపోతే అమ్ముతున్నా వా చెప్పు అని కోపించెను.
ప్రతి దినము సాయంకాలము ఇంటికి రాగానే అన్ని ఆవులు లాగే దీని చెంత కు కూడా పాలు పిండుట కు పోగా పాలు లేక చన్నులు ఎండి పోవుచున్నవి. నాకు ఏమీ అర్థం కావడం లేదు తల్లి. వాణి మాటలు విన్న రాణి మండిపడి ఓరి మూర్ఖుడా లేగ దూడ ఆవు చెంత పాలు లేకుండానా.
నీ మాటలు యందు నాకు నమ్మకం లేదు. ఈ దినము మొదలు పాలు తెచ్చి ఇవ్వకుంటే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని గద్దించ పల్కి గోపాలుని వెళ్లమని చెప్పాను . మరునాడు ఉదయం గోపాలుడు ఆవును ఓ కంట కనిపెడుతూ పోవుచుండెను .ఆవు శేషాచలము నకు వెళ్ళి మందను విడిచి వెంటనే పుట్టను సమీపించి పాలు వదులుట ఆరంభించెను .
అది చూసిన గోపాలుడు పట్టరాని కోపంతో తన చేతిలోని గొడ్డలితో ఆవును కొట్టబోయేను. అది గమనించిన శ్రీహరి తనకు పాలు నిలుచున్న గోమాతను రక్షించుటకు లేచేసరికి శ్రీమహావిష్ణువు గొడ్డలిపెట్టు శిరమున బలముగా తగిలి రక్తం రావటం ప్రారంభించెను. గోపాలుడు ఆ రక్తాన్ని చూసి మూర్ఛ పోయాను దేవదేవుని శరీరము నుండి కారిన రక్తం ఆవుపై కూడా పడెను.
శ్రీహరి చోళరాజు నకు ఘోర శాపం ఇచ్చుట మిచ్చట
దేవతా పశువు అచట నుండి బయలుదేరి చోళరాజు ఆస్థానంలో ప్రవేశించి అంబా అని అరుచు వచ్చిన మార్గమును చూపుతూ కాలు దువ్వి తనవెంట రమ్మని కోరెను.
చోళరాజు వారి భటులు ఆవువెంట పోవుచుండగా ఆవు వు వెంకటాచలము చేరి గోపాలుడు మూర్చ పొందిన స్థలమునకు గొనిపోయి అచ్చట నిలబడిన.
చోళరాజు నాకు పుట్ట యందు బాధాకరమైన ఒక మూలుగు వినిపించెను . భక్తులను చుట్టుపక్కల వెదకమని ఆజ్ఞాపించెను . చోళరాజు పుట్ట దిశకు వచ్చి చూడగా నారాయణ శరీరము నుండి ధారపాతంగా రక్తం ప్రవహించుట సూచి చోళరాజు మహానుభావ తమరు ఎవరు తెలపండి అనెను.
అతని మాటలకు శ్రీహరి కనులు తెరిచి లేచి నేను ఎవరో చూడము అని సాక్షాత్కరించి మిక్కిలి కోపముతో తో ఓరి మూర్ఖుడా ముందు వెనుకా ఆలోచించక గోపాలను చే గొడ్డలితో కొట్టి నందులకు నీవు పిశాచ అవుగాక అని శపించెను.
సేవకులు చేసిన తప్పులకు రాజే బాధ్యులు. నా శాపమునకు తిరుగులేదు అని చెప్పగా చోళరాజు దుఃఖించు నారాయణ నీవు ఈ పుట్ట యందు ఉండటం నాకు తెలియదు .
నాకు తెలిసినచో నేను మీకు నిత్యసేవలు చేయవాడును. పురుషోత్తమ నేను నిరపరాధి ని నన్ను క్షమించు అని స్వామివారిని ప్రార్ధించెను.
అందులకు శ్రీహరి చోళరాజా నా శాపమునకు తిరుగులేదు కావున నీవు శరీరము చాలించి చోళ వంశమునే పుట్టి ఆకాశరాజు నామధేయము గా జన్మించేధవు.
నీ కుమార్తె పద్మావతిని నాకు ఇచ్చి వివాహము గావించెను. నీవు నాకు వజ్రకిరీటం సమర్పించు. నేను ఆ కిరీటమును ప్రతి శుక్రవారము ధరింతును. నీవు పరిపూర్ణమైన మోక్షము పొందెదవు అని శాపవిమోచనము చెప్పాను.
గోపాలుడికి శ్రీహరి వరం ఇచ్చుట
గోపాలుడు మూర్ఛ నుండి లేచి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి నేను మూర్ఖుడునీ నన్ను రక్షింప మని వేడుకొనెను.
శ్రీహరి కరుణించి ఇందు నీ తప్పిదము ఏమియు లేదు ఈ భూలోకమున నన్ను మొట్టమొదట నువ్వే నన్ను దర్శించుకున్నావు. కావున నా ఆలయమునందు కూడా మొదట నీ వంశీయులకు దర్శనం కలుగును.
నీవు చరిత్రలో సుప్రసిద్ధుడు అవుతావు . అని చెప్పెను. అచట నుండి గొల్లవాడు వెళ్ళిపోయాను. ఆనాడు శ్రీహరి గొల్లవాని కి ఇచ్చిన మాట ప్రకారం నేటికిని ఆ వంశపారంగా వచ్చే గొల్లవాడు మొట్టమొదట శ్రీహరి ఆలయం తలుపులు తెరిచి దర్శనం చేసుకున్న తరువాత మిగతా కార్యక్రమం జరుపుతున్నారు . శ్రీహరిని గొడ్డలితో కొట్టిన గొల్లవానిని ఇప్పటికీ భక్తులు కూడా చూడవచ్చు.
Sri Venkateswara Swamy Jeevitha Charitra Episode 4
0 Comments