Subscribe Us

header ads

Sri Venkateswara Swamy Jeevitha Charitra Episode 5

భూ వరాహమూర్తి వృత్తాంతము . 

Sri Venkateswara Swamy  Jeevitha Charitra Episode 5

పూర్వకాలమున సనకసనందనాదులు శ్రీహరిని దర్శించుటకై గుజ్జురూపములు ధరించి వైకుంఠమునకు పోయిరి .
ద్వారపాలకులుగాయున్న జయ విజయులు మునులను దర్శనమునకు పంపక అడ్డగించి వెనుకకు త్రోయగా మునీశ్వర్లు అవమానము భరించలేక మీరు “ రాక్షసులై " పోయెదరుగాక అని శపించరు .

జయ విజయులు మా తప్పులను క్షమించమని మునులను ప్రార్థించగా , వారు శాంతించి మా శాపమునకు తిరుగులేదు . కావున మూడు జన్మములలో శ్రీహరిని ఎదిరించి వారి చేతులలో మరణించి , తరువాత వైకుంఠమున యథావిధిగా ద్వారపాలకులై విష్ణుమూర్తిని సేవిం చెదరని చెప్పి వైకుంఠమునుండి మునీశ్వర్లు వెళ్ళిపోయిరి .

జయ విజయులు ఒకడు హిరణ్యాక్షుడు , రెండవ వాడు హిరణ్యకశ్యపుడు అను నామములతో భూ లోకమున రాక్షసులుగా జన్మించిరి .

 హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు . ఋషులను , దేవతలను , విష్ణుభక్తులను హింసించుచుండెను. ఒకసారి భూ మండలమును చాపగా చుట్టి పాతాళమున దాచెను . దేవతలు   హిరణ్యాక్షుని  బాధలు భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థించారు.

విష్ణుమూర్తి   అభయమిచ్చి  వారిని పంపివేసి తాను శ్వేతవరాహ అవతారము దాల్చి సముద్రగర్భమునుండి పాతాళము నకు పోయి తన వాడి కోరలతో హిరణ్యాక్షుని చంపి భూమిని పైకి తెచ్చెను .

ఋషులు , దేవతలు , గంధర్వులు వరాహస్వామిని ప్రార్థించి యీ భూమండలమును కాపాడినారు . కావున భూలోకములో నుండి భక్తులను కాపాడవలసినదిగా ప్రార్థించారు.

విష్ణుమూర్తి శేషాచలమలో నివాసము ఏర్పరచుకొని భక్తులను సంరక్షణ చేయుచు మునులతో యిష్టాగోష్టి జరుపుతు తనను దర్శింపవచ్చిన భక్తులను రక్షించుచుండెను .

వరాహ స్వామికి ఎంతోమంది భక్తులు ఏర్పడిరి . అందులో ముఖ్యురాలు వకుళాదేవి ఆమె స్వామికి భక్తితో పరిచర్యలు చేయుచుండెను .

వకుళా దేవి పూర్వజన్మ వృత్తాంతము . 


ద్వాపర యుగమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారమును చాలించునని తెలిసి ద్వారళవాసులు   అందరూ దుఃఖసాగరమున మునిగియుండు సమయమున యశోదాదేవి ఆ వార్త తెలుసుకొని కృష్ణునివద్ద వచ్చి" నాయనా : నీవు  అవతారము చాలించున్నావు అని  విన్నాను . నీముద్దు  ముచ్చటలు అన్నీ చూశాను . కాని నీకు జరిగిన కళ్యాణము లను ఒక్కటి గూడ చూచుటకు నోచుకోలేదు . కావున నీ వివాహము , తనివితీరా చూచు భాగ్యము నాకు కల్పించు అని కోరెను .

అందులకు శ్రీకృష్ణుడు యశోదా దేవిని యూరడించి " మాతా ! నేను కలి యుగములో వేంకటనాయకుడై అవతారము దాల్చి నీ చేతుల పైగా వివాహము జరిపించుకొనెదను .

నీవు కలియుగములో వకుళమాతగా జన్మించి శ్రీ వరాహ స్వామిని పూజించుచుండగలవు . నేను అచ్చటికి వచ్చి నీతో కలసి కాలము గడుపు చుండును " యని వరము ఇచ్చెను . శ్రీకృష్ణ పరమాత్మ మాటలు విన్న యశోద మిక్కిలి సంతోషించెను . యశోదాదేవి జీర్ణమైన శరీరమును విడచి , కలియుగమున వకుళమాలికగా జన్మించి శేషాచలమున శ్రీ వరాహస్వామిని సేవించుచుండెను .

Post a Comment

0 Comments