శ్రీహరి స్థలమునకు శ్రీ వరాహస్వామిని యాచించుట
Sri Venkateswara Swamy Jeevitha Charitra Episode 6
తిరుమల లో వరహస్వామి దర్శించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించకొనవలెను.
దేవదేవుడు గొల్లవాని దగ్గర దెబ్బతిన్న తర్వాత గాయమునకు ఔషధము కొరకు వెతుకుతూ అడువు లోబడి పోవుచుండెను.
దేవగురువైన బృహస్పతి ఈ విషయం తెలిసి వేంకటాచలమునకు వచ్చి స్వామివారిని దర్శించెను.
శ్రీహరి బృహస్పతిని గౌరవించి తనకు తగిలిన దెబ్బకు ఔషధము తెలపమని కోరేణు.
బృహస్పతి ఇట్లు అనెను. పద్మనాభ భక్తులను రక్షించుటకు నువ్వు ఎన్ని కష్టాలకు లోనవుతూన్నావు. నీ గాయములనుకు తగిన ఔషధం ఏమనగా మేడిచెట్టు పాల యందు జిల్లేడుపత్తిని తడిపి గాయమునకు పట్ట మనేను.
ఈ విధముగా వారము రోజులు చేసినచో గాయము పూర్తిగా మాని పోగలదు అని చెప్పి దేవగురువు శ్రీహరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాను.
శ్రీహరి మేడీ చేట్టును వెదుకుతు పోవుచుండగా మార్గమధ్యంలో ఒక పర్ణశాల కనపడింది. ఆ పర్ణశాల లోపల శ్రీ కృష్ణ నామ భజన వినిపించింది.
శ్రీహరి బాధను భరించలేక అమ్మ అమ్మ అని అరిచెను. శ్రీ కృష్ణ భజన చేయుచున్న వకుళమాత కు తన తనయుడు శ్రీ కృష్ణుడు పిలిచినట్టుగా వినబడెను.
వెంటనే భజన ఆపి బయటికి వచ్చి చూసింది.
ఆమెకు శ్రీహరి గాయాలతో కనిపించెను. వెంటనే లోపలికి తీసుకొనిపోయి విచారించి అడగాగా శ్రీవారి దేవ గురువు చెప్పిన విధానము వివరించాడు.
వకుళ దేవి బృహస్పతి చెప్పిన విధముగా గాయము నకు మందు వేసి కట్టు కట్టింది. పాలు పలహారాలు ఆహారంగా శ్రీహరికి ఇచ్చెను. శ్రీహరికి బడలిక తగ్గినకా ఎవరు నాయనా నువ్వు అని అడిగేను. నిన్ను ఎవరు గాయపరిచినారు అని వకులమత ప్రశ్నించెను.
అందుకు శ్రీహరి జనని నన్ను మర్చిపోయినవా నన్ను పూర్తిగా గమనించి చూడు అని అనెను.ఇంతలో వకుళమాత కు పూర్వజన్మ స్మృతిని కలిగించి శ్రీకృష్ణావతారం చూపించేను.
నా తండ్రి నీవా అని తనయుని కౌగలించుకొనెను. శ్రీహరి తన చరిత్రను అంతయు వకుళ మాతకు వివరించి చెప్పెను.
మరుసటి రోజు ఉదయమున వకుళాదేవి శ్రీమహావిష్ణువునకు స్నానపానాదులు లను చేయించిన తర్వాత నాయన ఇచట శ్రీ వరాహస్వామి నివసించుచున్నారు.
ఆ స్వామిని దర్శించి వద్దాము రమ్ము అని వకుళ దేవి శ్రీహరిని వరాహస్వామి దగ్గరికి తీసుకుని వెళ్లాను.
నారాయణుడు ,వకుళాదేవి వరాహస్వామిని భక్తితో పూజించారు . వరాహస్వామి వారిని దీవించి విష్ణు పరిస్థితిని దివ్యదృష్టితో తెలుసుకొనెను.
వరాహస్వామితో శ్రీహరి నేను ఈ కొండల పైన నివసించుటకు కొంత స్థలము కావలెను అని కోరెను .అందులకు వరాహస్వామి విష్ణుమూర్తిని ధనము ఇచ్చినచో స్థలము ఇచ్చునాని చెప్పాను.
అందులకు విష్ణుమూర్తి వరాహ స్వామిని చూసి ప్రస్తుతము లక్ష్మీదేవి నా చెంత లేనందున నేను సిరిలేని వాడును.
కావున స్థలము ఇచ్చినచో నివాసం ఏర్పరచుకొనెను. నా దర్శన భాగ్యము కొరకు వచ్చు భక్తులు మొట్టమొదట నిన్ను దర్శించి నీకు నైవేద్యం పెట్టిన తరువాత నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించగలరు. అని శ్రీహరి చెప్పెను .
అటుపిమ్మట విష్ణుమూర్తి వకుళాదేవి వరాహ స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.వకుళ దేవి విష్ణువును చూచి నాయనా నిన్ను ఏ పేరుతో పిలవను అని అడిగేను. అందులకు శ్రీహరి తల్లి నీ ఇష్టం వచ్చిన పేరు పిలవమని సమాధానము చెప్పెను.
నాయనా ఈ నాటి నుంచి నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెట్టింది. ఈ విధముగా విష్ణుమూర్తి శ్రీనివాసుడుగా పిలువబడుచున్నడు.
ఆనాడు శ్రీహరి వరాహస్వామికి ఇచ్చిన వాగ్దానము ప్రకారము నేటికీ భక్తులు బంగారు పుష్కరిణి వద్ద నున్న శ్రీ వరాహస్వామి వారిని మొట్టమొదట దర్శించి తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించే నైవేద్యం మొట్టమొదట వరాహస్వామి వారికి సమర్పించి తర్వాత నైవేద్యమును శ్రీవెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తున్నారు.
0 Comments