నారదముని పద్మావతికి హస్త సాముద్రిక చెప్పుట
, పద్మావతి దినదిన ప్రవర్ధమానమై శుక్ల పక్షమున చంద్రునివలె ప్రకాశించి చున్నది . పద్మావతి వరప్రసాదమున అవతరించిన బిడ్డ గనుక గురువులవద్ద నక విద్యలు అభ్యసించినది . క్రమముగా పదునాల్గు యేండ్ల యుక్తవయస్సు వచ్చినది . రతీదేవివంటి చక్కదనము , సరస్వతీ దేవివంటి విద్య , గౌరీ దేవివంటి పవిత్రం లక్ష్మీ దేవివంటి అలంకారము కలిగివున్నది . సౌందర్యమునకు తగిన వయసువయసుకు తగిన విద్య , విద్యకు తగిన వినయము గలిగి గొప్ప కీర్తి సంపా రించెను . శుక్రవారమునాడు పద్మావతి గౌరీపూజ చేసి చెలికత్తెలతో ఆంఠ పురములో ఆడుకొనుచున్న సమయమున హరినామ సంకీర్తనచేస్తూ నారదముని ఆమె మంది రావికి వచ్చెను .
నారద మహర్షిని పద్మావతి చూచి , సాష్టాంగ దండ ప్రణామముల నాచరించి సుఖాసీనునిచేసి అతిథి మర్యాదలను చేసెను . నారదమహర్షి పద్మావతి వినయ విధేయతలకు మెచ్చి నటువంటివాడై " అమ్మా ! నీ ఎడమచేయి చూపుము . నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలము విషయములను దెలిపెదను " " అనియెను . అప్పుడు పద్మావతిదేవి జ్ఞానదనమై నారదముని చెంత తేరి చేయి జూ పెను . నారదమహర్షి చేయి చూచి యిలా చెప్ప సాగెను . " వద్మ , ద్వజ మరియు మత్స్యరేఖ లుండుటచే వీవు ఆ శ్రీమన్నారా యునికి యిల్లాలు కాగలవు .
పద్మ రేఖ ధనధాన్యసంప త్తివి , మత్స్యరేఖ ఆనంద మైన జీవితము , ధ్వజ రేఖ రాణివాసమును సూచించుచున్నది . కీర్తిరేఖలు కూడ విందు గలవు . ప్రజల ఆదరాభిమానములను చూరగొనెదవు . నీకేమీ తోటూ ఉండదు . నే నిక బోయివచ్చెదను . శీఘ్రమే కళ్యాణప్రాప్తిరస్తు " అని దీవించి వెళ్ళెను . శ్రీనివాసుడు వేటకు బోవుట . వేంకటాచలమందు శ్రీనివాసుడు వకుళా దేవి చేయు ఉపదర్యలతో ఆనంద ముగా కాలమును వెళ్ళబుచ్చుచుండెను . ఇట్లుండ నొక దినమున శ్రీనివాసునకు వేటాడ వలయునని కోరిక అనించి తన కోరికను వకుళాదేవికి యెరిగించెను . ఆమె కుమా రుని చూచి “ నాయనా ! నీవు చాలా సుకుమారుడవు .
అరణ్యములయందు వివసించు క్రూరమృగములతో చెలగాటమా | నాకు భయమును కలిగించుచున్నది . మన వెందులకు ఈ వేట " యనెను . అందులకు శ్రీనివాసుడు నవ్వి “ అమ్మా , ధయ పడవలదు . ఆ క్రూరజంతువులు నన్నేమి చేయజాలవు . నా ప్రతాపము నీకు తెలియనిది కాదు . నా చిన్నకోర్కెను తీర్చుకోనిమ్ము " అని పలికెను . వకుళాదేవి మారుమాటలాడక అద్దే క్షేమముగా వెళ్ళిరమ్మని ఆశీర్వదించెను .
శ్రీనివాసుడు వేటగాని వస్త్రములు ధరించి చేతియందు విల్లనూ ఆంబులునూ బూని తల్లి వద్ద సెలవునొంది . వేంకటాచల కొండలలో నుండి ఒక మహారణ్యములో ప్రవేశించెను . శ్రీనివాసుడు తన విల్లునకు దాణము సంధించి ధనుష్ఠాంకారము చేసెను . ఆ ధ్వని పిడుగులు పడినట్లు ఆ ప్రదేశమంత మారుమ్రోగెను . ” ఆ భయంకరశబ్దము విన్న సింహములు , యేనుగులు , పెద్దపులులు , జింకలు మొదలగు వన్య మృగములు భయపడి తమ తమ స్థానములు వదలి చెల్లాచెదరై అరచేత ప్రాణము లను పట్టుకొని , ప్రాణభీతితో పరుగెత్తుచుండెను .
ఆ ఆదును చూచుకొని శ్రీనివాసుడు పదునైన బాణములను ప్రయోగించి సింహములను చెండాడి , ఏనుగులను తరుముదు , పులుల తలలు ఒక్క వేలునకు నేలకు ఒరుగునట్లు చేయుచు ఆడవి పందులను వధించుచూ ఆకణ్యమంతా అల్ల కల్లోలముగా చేసెను . ఆ సమయమున ఒక మదపు చేనుగు మీంకారము చేసెను , ఆధ్వని వచ్చిన దిగడు శ్రీనివాసుడు పరుగు పరుగున వెళ్ళి దానిని వెంబడించెను , ఆ ఏనుగును తరుముటకు వీలులేక పోయినందున శ్రీనివాసుడు బ్రహ్మ దేవుని వేటకుబోయిన శ్రీనివాసుడు బరావతమును తరుముకొని పోవుట . తలంచెను . తక్షణమే తెల్లటి అశ్వము ఎదుట ప్రత్యక్ష మయ్యెను .
ఆ తెల్ల గుఱ్ఱ మెక్కి ఏనుగును తరుముకొనుచు వెళ్లెను . ఆ మదపు దేనుగు చాల దూరము పరుగెత్తి శ్రీనివాసునికి తన తొండముతో నమస్కరించి చివరకు కంటికి కనుపించ కుండా పారిపోయినది . శ్రీనివాసుడు యేనుగు నమస్కరించినందులకు సంతోషిం నోరులేని మృగములను వేటాడుట మాని దప్పిక తీర్చుకొనుటకు సమీపములో యున్న ఉద్యానవనములో ప్రవేసించి కొలనును చూచెను .
పద్మావతి వనవిహారము ; శ్రీనివానుని రాళ్లతో గొట్టించుట ,
శ్రీనివాసుడు ఆశ్వమునకు నీరు త్రాగించి తాను దప్పిక తీర్చుకొనెను . విశ్రాంతి తీసుకొనుటకు మహాబోధి వృక్షముచెంతకు చేరునంతలో అతని చెవికి మధుర గానము వినిపించెను . శ్రీనివాసుడు గానము నాలకించుచుండ పద్మావళి తెలికత్తెలతో యాటలాడుకొనుచు పాటపాడుడు శ్రీనివాసుడున్న మహాబోధి వృక్ష మును సమీపించెను . అవివానుడు పద్మావతిని చూచి చిరువగపుతో తన్ను తాను మైమరచిన టువంటివాడై " ఏమీ ఆశ్చర్యము | భూలోకమునందుకూడ ఆప్సరస అను తలదన్ను సౌందర్యవతు లుండుట యాశ్చర్యకరమైన విషయము . ఏమి యీ రూవలావణ్యత : జగదేక సుందరియై కనబడుచున్న ఈ నవమోహిని యెవ్వరై యుండును , విదారింతు " నవి లోలోన తలపోయుడు ముందునకు నడువసాగెను .
పద్మావతి దేవి శ్రీనివాసుని చూచి చెలికత్తెలతో ఆ వర పురుషు డెవ్వడు - ఇచ్చటికి యెందులకు వచ్చుచున్నాడో కనుగొని రండని సం పెను . చెలులు శ్రీనివాసుని సమీపించి అయ్యా , మీ రెవరు , ఎందులకు యిచ్చటికి వచ్చితిరి " అని అడిగి పందులకు శ్రీనివాసుడు " ఓలలనామణులారా , నేను ఒంటరివాడను . నాకు నా యనువా రెవ్వరు లేరు . నా , నివాసము శేషాచలము " యనెను . “ పద్మావతి శ్రీనివాసుని సమీపింప శ్రీనివాసుడు పద్మావతిని చూచి యిట్లు పలుకరించెను . " జవ్వనీ , వీ తల్లిదండ్రు లెవ్వరు : వీ శుభనామ మేమి " " యని యడుగ అందు లకు పద్మావతి " ఆర్యా ! నా తండ్రి ఆకాశరాజు నా జనని ధరణీదేవి యని చెప్పి తమరు యిచ్చటనుండి తక్షణమే వెళ్ళిపొండు .
ఈ వనములో పరపురుషులు ప్రవేశించరాదు " అని హెచ్చరించెను . “ శ్రీనివాసుడు " నీ రూపురేఖ విలాసములు నన్ను బంధించినది . నిన్ను విడచి వెళ్లటకు నా మనసు అంగీకరించుటలేదు . వీపు నా కొరకు అన్మించిన దానవు , నిన్ను నా మనసార ప్రేమించితిని . నన్ను వివాహమాడుటకు అంగీక దింతువా " అని కోరెను . వేటగాని ప్రేమ వాక్యములు వినేసరికి పద్మావతికి తగ్గు మన్నది . కన్ను లెర్రజేసి “ూర్ఖుడా ! నే నెవ్వర నుకొంటివి , నా తండ్రికి తెలియబరచినచో నీ ఆయువు మూడినట్లే . పరుల వేటాడి జీవించు బోయవానికి రాజకుమార్తెతో పెండ్లి కావలయునా - బుద్ధి కలిగి ప్రాణములను దక్కించు కొనుము .
ఇటనుండి తక్షణమే పొమ్ము లేదేని ..... నీ ప్రాణములు దక్కవనెను , శ్రీనివాసుడు మందహాసముతో ' సుందరీ | నన్ను నీవు దూషించుట సహజమే : ప్రేమకు అంతస్తులు లేవనుట నీకు తెలియదా ! అందాల రాసివైన ఏ రూపము నా నవనీత హృదయపీఠము నలంకరించినది , నిన్ను వివాహమాడులునిశ్చయము . ఇది సత్యము . నీవు సమ్మతించి పుణ్యము గట్టుకొమ్ము " యని పలికి శ్రీనివాసుడు ముందడుగిడెను . ఇంక ఆలపించిన ప్రమాదమని గ్రహించి పద్మావతి చెలులకు కనుపైగ చేసెను . చెలికత్తెలు రాళ్ళతో శ్రీనివాసుని గొట్టసాగిరి . ప్రక్కనున్న అశ్వము ఆరాళ్ళ దెబ్బలకు భరించలేక అక్కడి కక్కడే మరణించెను . శ్రీనివాసుని శరీ రమునుండి రక్తము స్రవించుచుండినను పద్మావతిని క్రీగంట జూచుచు వడివడిగా పరుగిడుచు వరాహగిరిని చేరుకొనెను .
0 Comments