పద్మావతి దేవి కనుసైగతో శ్రీనివాసుని రాళ్లతో కొట్టించుట.
శ్రీనివాసుడు శేషాచలము దాటి ఒక మహారణ్యంలో కి వెళ్లగా అక్కడ జంతువులను వేటాడి ఆలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
ఆ వృక్షము పేరు మహా బోధి వృక్షము . ఇంతలో శ్రీనివాసుడు గుర్రానికి నీళ్లు సాగిస్తుంటే ఒక మధురమైన గానము వినిపించింది.
ఆ పాట ఎవరిదని వెతుకుతుండగా ఇంతలో పద్మావతీదేవి చెలికత్తెలతో పాట పాడుతూ శ్రీనివాసుడు కూర్చున్న వృక్షము దగ్గరికి వచ్చింది.
శ్రీనివాసుడు పద్మావతిని చూచి మనసులో ఇలా అనుకుంటున్నాడు. భూలోకంలో అప్సరసలు తలదన్ని సౌందర్యవంతులు ఉంటారా. ఏమి ఈ రూప లావణ్యవతి జగదేక సుందరి వలే కనపడుతున్న ఈ నవ మోహిని ఎవరై ఉంటారు అని అనుకుంటున్నాడు.
పద్మావతి శ్రీనివాసుని చూచి చెలికత్తెలతో ఈ పరపురుషుడి ఎవరు ఎందుకు వచ్చాడు కనుక్కోమని పంపించింది.
చెలికత్తెలు శ్రీనివాసుని అడగక శ్రీనివాసుడు నేను ఒంటరి వాడిని నాకు ఎవరూ లేరు నా నివాసము శేషాచలము అని బదులు చెప్పాడు.
శ్రీనివాసుడు పద్మావతిని చూచి మీ పేరు ఏమిటి నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. పద్మావతి దేవి నా తండ్రి ఆకాశరాజు నా తల్లి ధరణీదేవి అని చెప్పి మీరు ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళిపొండి. ఈ వనములు పరపురుషులుకి ప్రవేశము లేదు అని హెచ్చరించింది.
శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూస్తూ ఇలా అన్నాడు మీ రూపు రేఖలు నన్ను బంధించిచాయి. నిన్ను విడిచి వెళ్ళుటకు నా మనసు అంగీకరించటం లేదు.
నీవు నా కొసం పుట్టిన దానివి . నిన్ను నా మనసారా ప్రేమించు చున్నాను. నన్ను వివాహమాడుటకు అంగీకరించండి అని కోరాడు.
అందుకు పద్మావతీదేవి వేటగాని ప్రేమ వాక్యములు విని భగ్గుమన్నది కన్నులు ఎర్ర చేసి మూర్ఖుడా నేను ఎవరిని అనుకుంటున్నావు . నా తండ్రికి తెలిస్తే నీ ఆయువు మూడినట్టే పక్షులను వేటాడి జీవించేవాడీకి రాజకుమార్తె తో పెండ్లి కావాలా.
బుద్ధి కలిగి ప్రాణాలు దక్కించుకో. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నీ ప్రాణాలు దక్కవు అని పద్మావతి హెచ్చరించింది.
శ్రీనివాసుడు చిన్న మందహాసముతో నన్ను నీవు దూషించుట సహజమే ప్రేమకు అంతస్తులు లేవని సంగతి నీకు తెలియదా. నా మనసులో నీ రూపము హృదయ పీఠము అలంకరించినది.
నిన్ను వివాహమాడుట నిశ్చయము. ఇది సత్యం. నీవు సమ్మతించి పుణ్యం కట్టుకో అని శ్రీనివాసుడు పద్మావతిని ముందుండి అడిగాడు.
ఇక ఆలస్యం చేస్తే ప్రమాదం అని గమనించిన పద్మావతి చెలికత్తెల కు కనుసైగ చేసింది . చెలికత్తెలు శ్రీనివాసుడి పై రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు.
ఆ రాళ్ళ తాకిడికి పక్కనే ఉన్న గుర్రం దెబ్బలు భరించలేక అక్కడ అక్కడే చనిపోయింది. ఆ రాళ్ళ తాకిడికి శ్రీనివాసుడి శరీరము నుండి రక్తము ధారవలే ప్రవహించుచున్నది. పద్మావతి అక్కడనుంచి పరుగు పెడుతూ వరాహగిరి చేరుకుంది.
శ్రీనివాసుడు వకుళమాత కు తన మనో భావము వెళ్లబుచుట.
వేటకు వెళ్లిన శ్రీనివాసుడు తిరిగి వచ్చి పక్క పై పడి మూలుగుతూ ఉండెను. వకుళమాత తెచ్చి ఇచ్చిన పండ్లు కందమూలములను తినకుండా అలాగే ఉంచెను.
శ్రీనివాసుని శరీరం మీద తగిలి ఉన్న గాయములను చూసి వకుళ మాత ఆవేదన చెందుతూ నాయనా నిన్ను గాయపరచిన వారు ఎవరు అని అడగగా శ్రీనివాసుడు మౌనంగా కూర్చున్నాడు.
నాయనా నేను నీ తల్లిని గానా నా దగ్గర నీకు దాపరికం ఎందులకు చెప్పు నాయనా అని పదేపదే అడిగింది. అప్పుడు శ్రీనివాసుడు అమ్మ నేను అడవిలో మదపుటేనుగును తరూముతూ పోగా అది కొంత దూరం పరిగెత్తి చివరికి కంటికి కనబడలేదు.
నేను దప్పిక తీర్చుకొనుటకు ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఉద్యానవనములు ప్రవేశించి అచ్చట వున్న కొలనులో దప్పిక తీర్చుకొను సమయమున నాకు ఒక మదురుగణము వినిపించింది.
గానము ఆలకించు ఉండగా వారు అచటికి వచ్చిరి వారిలో ఆకాశ రాజు పుత్రిక పద్మావతిని చూచి మోహ పరవశులై నా మనో నిశ్చయం ఆమెకి తెలిపాను.
దాని ఫలితమే ఈ దెబ్బలు. శ్రీనివాసుని వాక్యములు విన్న వకుళ దేవి నాయనా నక్క ఎక్కడ నాగ లోకం ఎక్కడ పద్మావతిని వరించుట ఆకాశమునకు నిచ్చిన వేసినట్లు.
ఆకాశరాజునకు ఈ విషయం తెలిసిన మనలను బ్రతక ని ఇవ్వడు . నీ ఆశ అతీతమైనది వద్దు నాయనా మనకు. ప్రేమకు స్దాన స్థానములు తారతమ్యములు లేవా గర్భ దరిద్రులకు రాచబిడ్డనీ ఇస్తారా. నా మాట విని నీ మనసు మార్చుకో అని శ్రీనివాసునకు వకుళాదేవి నీతులు బోధించింది.
అప్పుడు శ్రీనివాసుడు ఇలా అన్నాడు. అమ్మ నేను త్రేతా యోగములు శ్రీరామచంద్రుని అవతారము దాల్చినప్పుడు జనకుని మాట పాలించుటకు అడవికి పోగా రావణుడు సీతను అపహరించుటకు వచ్చిన సమయమున అగ్నిదేవుడు వానిని మోసపుచ్చి సీత స్థానంలో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచినడు.
మాయ సీతను రావణుడు ఎత్తుకుని పోయాడు. రావణుడిని సంహరించి సీతను అగ్ని ప్రవేశం చేయించాను .
అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇరువురు సితలను నాకు చూపించి జరిగిన విషయం తెలిపి వేదవతిని వివాహము చేసుకోవాలని అగ్నిదేవుడు కోరాడు.
అందులకు నేను రామావతారంలో ఏకపత్నీ వ్రతుడును కావున కలియుగములో వేదవతి ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా జన్మించాగలదు.
నేను అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను . ఆ వేదవతిఏయ్ ఈ పద్మావతి. ఆనాడు వేదవతి కి ఇచ్చిన మాట నేడు చెల్లించవలసి ఉన్నది అని వకుళ మాతకు వివరంగా చెప్పాడు.
3. పద్మావతి విరహవేదన
పద్మావతి కి ఉద్యానవనములు వేటగాని రూపంలో ఉన్న పురుషున్ని చూచిన మొదలు ఆమెకు అతనిపై మోహము ఎక్కువై కన్ను మూసినా కనులు తెరిచినా ఆ నవమోహనడే కనిపించనున్నాడు.
తల్లికి చెప్పుకున్న బికారి వాణి సంబంధమున్న కు సమ్మతించదు అని. తండ్రి వింటే తనకు తగిన అల్లుడు కాడని అంటాడేమో అని తన మనస్సులో వున్న మాట తల్లిదండ్రులకు ఒప్పించడం ఎలా అని ఆలోచిస్తూ నిద్ర పోవటం లేదు ఆహారం తీసుకోవటం లేదు. చెలికత్తెలతో మాట్లాడటం లేదు అలంకరించుకొవటం లేదు వన విహార యాత్ర కూడా మనుకున్నది.
విరహ వేదన భరించలేక జ్వరము చేత శరీరమంతా మండుతున్నది . కనులు మూసుకుని పిచ్చిగా కలవరించు చున్నది.
ఆకాశరాజు ధరణీదేవి పుత్రిక వ్యాధి అంతుచిక్కడం లేదని ఆందోళన పడుచున్నారు. రాజ వైద్యులును భూత వైద్యులను రప్పించి మందులు ఇప్పించారు.
మంత్రాలు వేయించి యంత్రములు కటించారు. ఎన్ని చేసినను అవి వ్యర్ధమే అవుతున్నాయి. ఎందుకంటే మనోవ్యాధికి మందు లేదు కదా.
ఆకాశరాజు దేవాలయం లో పద్మావతి పేరు మీద అభిషేకాలు చేయించాడు .
ఎంతమంది ఎన్ని విధములు చేసిన పద్మావతి ఆరోగ్యము కుదుటపడ్తాలేదు. రోజు రోజు నాకు ఎక్కువగా అవుచున్నది కానీ తగ్గుట లేదు.
0 Comments