Subscribe Us

header ads

Sri Venkateswara Jeevitha Charitra Episode 12

         శ్రీనివాసునిగూర్చి ఆకాశరాజుకు ధరణీ దేవి విమర్శించుట , 


శ్రీనివాసునిగూర్చి ఆకాశరాజుకు ధరణీ దేవి విమర్శించుట , 

Sri Venkateswara Jeevitha Charitra Episode 12


ఎరుకలసాని సోది విన్నతరువాత పద్మావతి ఆనందమునకు అంతు లేకుండేను.ధరణీదేవి . విచారముతో ఆశాశరాజును సమీపించి , " నాదా  ! మన  పద్మావతి సుకుమారి యనునది  మీకు తెలియునుగదా ! అట్టి నా ముద్దుల బిడ్డను వనములో వివసించు నిరుపేద కిచ్చి వివాహము చేయుటకు నా మనసు అంగీకరించుటలేదు . " ఆనెను , ఆమె మాటలను విన్న ఆకాశరాజు " దేవీ : నారదమహర్షి వాక్యములు వ్యర్థము కాదు . 

అతను చెప్పిన ప్రకారము అక్షరాల జరిగితీరును . మన కులగురు వును రప్పించి వారితో నాలోచించుదునని చెప్పువంతలో , పద్మావతి తల్లిదండ్రులకు  నమస్కరించి " మాతాపితలారా , నేను ఉద్యానవనములో చూచిన పురు షోత్తముని తప్ప అన్యులను వివాహమాడను , నా జీవితమును ఆ పరమపురుషూనకు అంకిత మొనర్చితిని .

 సూర్య చంద్రులు గతులు దప్సిన దప్పవచ్చు . కాని నా నిశ్చయము మాత్రము మారదు " అని చెప్పెను . ఆకాశరాజు ధరణిదేవి  పద్మావతి  మాటలు విని తెల్ల బోయి చేయువదిలేక నీ యిష్ట ప్రకారమే జరుగును అని 
పద్మవతిని యూరడించిరి.


ఆకాశరాజు వద్దకు రాయదారిగా వకుళమాలిక చేరుట . 


వకుళమాత వరాహస్వామికి వివరములు తెలిపి ఆసిర్వాదములు పొంది శేషాద్రి నుండి బయలు దేరి నారాయణపురము చేరి ఆకాశరాజు అంతఃపురము ప్రవే పింది . 

ఆకాశ రాజును ధరణీ దేవిని కలసి కొన్నారు . ఆకాశరాజు , ధరణీదేవి వకుళ మాతకు నమస్కరించి . అతిథి మర్యాదలు చేసి " తల్లీ ! మీరు  యోగివలె కనవడు తున్నావు . ఏ నివాసస్థాన మీది - ఏకార్యార్థమై యిటు వచ్చితివి - దయచేసి సేల విండు " యనెను . 

అందులకు వకుళమాలిక " రాజా ! ఈ సమీపమున నున్న శేషాచలమందు నేను నివసించుచున్నాను . నా నామదేయము వకుళమాలిక . నాకుమారుని పేరు శ్రీనివాసుడు , నా కుమారుడు మూడు లోకములను ఏలగల్గిన శక్తి సంపన్నుడు , ప్రస్తుతము అతనికి సిరిసంపదలు దూరమై యున్నవి . 

నా కుమారుడు మీ పుత్రిక పద్మావతిని చూచి ప్రేమించెను . అతడు పద్మవతిని వివాహమాడ దంచెను . అందులపై ఇచ్చటకు వచ్చితిని . అతడు శ్రీహరి అంశము  కలవారు . 

మీ పుత్రికను , మా చిరంజీవి కిచ్చి వివాహము గావించినచో మీరు దన్యజీవు లగుటయు గాక పరమపవిత్రమై మోక్షము పొందుట నిశ్చయంబు " అన్న యామె వాక్కులకు ఆకాశరాజు , ధరణీదేవి ఆనందభరితులై " మాత . మా పెద్దలందరికి తెలియబరచి శీఘ్రముగా మీకు దెలియబరచెదము " అని నుడాన రాజదంపతులను ఆశీర్వదించి యచ్చటనుండి బయలు దేరి శేషాచలము చేరుకొనెను . 

శుకయోగిని ఆకాశరాజు రప్పించుట . 


ఆకాశరాజు వకుళమాలను సాగనంపి తన తమ్ముడైన తొండమానుని విలచి సోదరా , మన గురువైన శుక మహర్షిని గొనిరమ్ము . 

వారితో మన పద్మావతి వివాహముగూర్చి సంప్రదించవలయు ననగా తొండమానుడు వెళ్ళి శుకయోగిని వెంటనిడుకొని వచ్చెను . 

ఆకాశరాజు శుక మహర్షిని పూజించి " మునీంద్రా అది వరాహక్షేత్రమునందు నివసించు శ్రీనివాసునకు నా కుమార్తె పద్మావతిని పెండ్లి చేసి యివ్వమని వకుళమాత కోరిన విధానమును , యిదివరలో జరిగిన నారదమహర్షి సంభాషణలు , వనములో పద్మావతికి జరిగిన విషయములు , సోది సింగి వాక్కులు , పద్మావతి అభిప్రాయములు శుకయోగికి వివరముగా తెలిపి మీ అభిప్రాయము తెలియజేయవలయునని " కోరెను . 

శుకయోగి “ రాజేంద్రా : నీవు పుణ్య పురుషుడు . శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాడు . సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీ కల్లుడగుటచే ఏ జన్మ సార్థక మైనది . 

కావున ఆలస్యము చేయక శుభముహూర్తము నిర్ణయించి వివాహము జరిపించుమనెను . శుక మహర్షి పలుకులు విన్న ఆకాశరాజు , ధరణీదేవి , పద్మావతి . తొండమానుడు , వసుదానుడు మహదానందభరితులైరి

Post a Comment

0 Comments